ఉద్యోగుల పీఎఫ్‌పై 8.55 శాతం వడ్డీ

Provident Fund Interest Rate For FY18 Slashed To 5-Year Low - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి 8.55 శాతం వడ్డీరేటును జమ చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఆదేశించింది. కార్మికశాఖ మంత్రి నేతృత్వంలో ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీ బోర్డు ఈ రేటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఈ రేటును గతంలోనే ఖరారు చేసినప్పటికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నియమావళి కారణంగా అమలు చేయలేదని తెలిపింది. దాదాపు 5 కోట్ల మంది ఖాతాదారులున్న ఈపీఎఫ్‌వో అత్యల్ప వడ్డీరేటును ప్రకటించడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2016–17లో ఈ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top