రాహులోతో చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

Priyanka Gandhi Wishes Rahul On Bhai Dooj With Adorable Photos - Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ భాయ్‌ దూజ్‌((భగినీ హస్త భోజనం) పండుగ సందర్భంగా తన సోదరుడు రాహుల్‌ గాంధీతో దిగిన ఫోటోలను ట్విటర్‌లో పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు దిగిన ఫోటోలను ఓ ఫ్రేమ్‌లో అమర్చి ప్రియాంక షేర్‌ చేశారు. ఈ ఫ్రేమ్‌లో నానమ్మ ఇందిరాగాంధీ, తల్లిదండ్రులు రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీతో దిగిన ఫోటోలను సైతం ఆమె  ట్వీట్‌ చేశారు. వీటికి ‘లవ్‌ యూ రాహుల్‌గాంధీ.. భాయ్‌దూజ్‌’ అంటూ సోదరుడిపై ఉన్న అప్యాయతను వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే రక్షబంధాన్‌ రోజు సైతం ప్రియాంకా.. రాహుల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పోస్ట్‌ చేశారు.  

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక ఈ భాయ్‌ దూజ్ వేడుక. ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగ తర్వాత జరుపుకునే ఈ వేడుక సందర్భంగా సోదర, సోదరీవమణులు ఒకరికొకరు ఆశీస్సులు పొందడం, బహుమతులు ఇచ్చిపుచ్చకోవడం అనవాయితీ. కాగా సినీ ఇండస్ట్రీలో సైతం సెలబ్రిటీలు ఈ బాయ్‌ దూజ్‌ వేడుకలను  నిర్వహించుకొని వారి సోదరిలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top