breaking news
Priyankagandhi
-
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్ సంచలన కామెంట్స్
లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చెల్లి ప్రియాంక గాంధీ గనుక తన మాట విని వారణాసిలో ప్రధానిమోదీపై పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేదన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మంగళవారం(జూన్11) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది. నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు.బీజేపీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఉందని ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడింది.’అని రాహుల్ అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్‌కు సహకారం అందించాడని చెప్పారు. గతంలోలా పొత్తుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నామని చెప్పారు. -
త్వరలో తెలంగాణాకి ప్రియాంకగాంధీ
-
లవ్ యూ రాహుల్: ప్రియాంక
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ భాయ్ దూజ్((భగినీ హస్త భోజనం) పండుగ సందర్భంగా తన సోదరుడు రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు దిగిన ఫోటోలను ఓ ఫ్రేమ్‌లో అమర్చి ప్రియాంక షేర్ చేశారు. ఈ ఫ్రేమ్‌లో నానమ్మ ఇందిరాగాంధీ, తల్లిదండ్రులు రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీతో దిగిన ఫోటోలను సైతం ఆమె ట్వీట్ చేశారు. వీటికి ‘లవ్ యూ రాహుల్‌గాంధీ.. భాయ్‌దూజ్’ అంటూ సోదరుడిపై ఉన్న అప్యాయతను వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే రక్షబంధాన్ రోజు సైతం ప్రియాంకా.. రాహుల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక ఈ భాయ్ దూజ్ వేడుక. ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగ తర్వాత జరుపుకునే ఈ వేడుక సందర్భంగా సోదర, సోదరీవమణులు ఒకరికొకరు ఆశీస్సులు పొందడం, బహుమతులు ఇచ్చిపుచ్చకోవడం అనవాయితీ. కాగా సినీ ఇండస్ట్రీలో సైతం సెలబ్రిటీలు ఈ బాయ్ దూజ్ వేడుకలను నిర్వహించుకొని వారి సోదరిలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. love you @RahulGandhi ❤❤❤❤#भाईदूज pic.twitter.com/GxR4Og4P4d — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 29, 2019 -
కోర్టు తీర్పు షాక్‌కు గురిచేసింది: ప్రియాంక
రాజస్థాన్: పెహ్లూఖాన్ అనే పాలవ్యాపారిపై మూకదాడికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను అల్వార్ జిల్లాలోని స్థానిక కోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ప్రియాంకా గాంధీ వాద్రా విచారం వ్యక్తం చేశారు. 2017 ఏప్రిల్1న జైపూర్ నుండి ఆవులను కబేళాకు తరలిస్తున్నాడనే అనుమానంతో ఖాన్‌పై మూకదాడి జరిగింది. ఈ దాడిలో పెహ్లూఖాన్ చనిపోయాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఖాన్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు అక్కడే ఉన్నారు. మూకదాడి చేసిన నిందితులకు శిక్ష పడాలని బాధిత వర్గాలు ఎంత పోరాటం చేసినా ఫలించలేదు. చివరికి స్థానిక కోర్టు కూడా బాధితులకు షాక్ ఇచ్చింది. వారిని నిర్ధోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరుగుతుందని భావించానని, కోర్టు తీర్పు విస్మయానికి గురి చేసిందని ప్రియాంకా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు తనను షాక్‌కు గురిచేసిందని ఆమె ట్వీట్ చేశారు. కాగా రాజస్థాన్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని మూకదాడులకు వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా ఆగస్టు 5న చట్టం తీసుకొచ్చింది. మూకదాడిలో పాల్పడ్డవారికి నాన్‌బెయిలబుల్ వారెంట్, జీవిత ఖైదుతో పాటు ఐదు లక్షల జరిమానా వేసేందుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. రాజస్థాన్ ప్రభుత్వం ఈ అంశం పట్ల స్పందిస్తూ, మా ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిందని బాధతులకు అండగా ఉంటామని నిర్దోషులుగా ప్రకటించిన వారిపై హైకోర్టుకు వెళ్తామని ప్రభుత్వం పేర్కొంది. -
ప్రియాంకను 'ఆ' దృష్టితో చూడలేదు..
అసెంబ్లీలో ప్రియాంక గాంధీ ఫొటోను చూసిన బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ సెల్‌ఫోన్‌ను సభలోకి తీసుకెళ్లడం తప్పేనని క్షమాపణలు ప్రియాంకను ‘..ఆ’ దృష్టితో చూడలేదంటూ మీడియాకు వివరణ చర్చ సమయంలో మొబైల్ గేమ్ ఆడుతూ మీడియాకు చిక్కిన బణకార్ శాసనసభల్లో అమ్మాయిల ఫొటోలుచూడటం వారి సంస్కృతి : సిద్ధు బెంగళూరు: ప్రజాసమస్యల చర్చకు వేదికైన శాసనసభలో మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తూ బీజేపీ శాసనసభ్యులు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. ఇందులో ఒకరు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ ఫొటోను అసభ్య రీతిలో తాకుతూ (టచ్) కెమరా కంట పడ్డారు. వివరాలు... బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో బీదర్ జిల్లా ఔరాద్ నియోజక వర్గ ఎమ్మెల్యే ప్రభూచౌహాన్, బెంగళూరులోని బసవనగుడి ఎమ్మెల్యే రవిసుబ్రహ్మణ్య ఒకరి పక్కన మరొకరు కుర్చొని ఉన్నారు. జేడీఎస్ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి చెరుకు రైతుల సమస్య పై మాట్లాడుతున్న సమయంలో ప్రభుచౌహాన్ తన సెల్‌ఫోన్‌ను తీసి అందులోని కొన్ని ఫొటోలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే సహచర ఎమ్మెల్యే అయిన రవిసుబ్రహ్మణ్యకు తన ఫోన్లోని కొన్ని ఫొటోలను చూపించడం మొదలు పెట్టారు. అయితే సభలో కెమెరాలు ఉన్నాయని ఫోన్‌ను పక్కన పెట్టాలని సూచించిన రవిసుబ్రహ్మణ్య ఫోన్ చూడకుండా పక్కకు తప్పుకున్నారు. అయినా ప్రభు చౌహాన్ మాత్రం సెల్‌ఫోన్‌లోని ఫొటోలను చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుచౌహాన్ తన సెల్ఫోన్లో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, యోగా గురువు బాబారామ్దేవ్ల ఫొటోలను చూసి ఆ తర్వాత ప్రియాంకాగాంధీ ఫొటోను తాకుతూ జూమ్ చేయడం మీడియా కంటపడింది. ఈ విషయం ప్రసారం అవుతున్న విషయం తెలుసుకున్న రవిసుబ్రహ్మణ్య మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ‘ప్రభు చౌహాన్ కూతురి పెళ్లికి నేను హాజరుకాలేక పోయాను. అందుకే ఆయన తన సెల్ఫోన్లో ఉన్న కూతురు, అల్లుడు ఫొటోలను చూపిస్తున్నారు. నేను ఇది సమయం కాదని చెప్పడంతో మిన్నకుండి పోయారు. ఆయన ఏ ఫొటోను చూశారో నాకు తెలియదు.’ అని వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత కొద్ది సేపటికి ప్రభుచౌహాన్ కూడా మీడియాతో మాట్లాడుతూ... ‘శాసనసభలోకి సెల్‌ఫోన్‌ను తీసుకువెళ్లకూడదన్న నియమాన్ని పాటించకపోవడం నేను చేసిన తప్పు. ఇందుకు క్షమాపణ కోరుతున్నా. జామర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో నా ఫోన్‌కు మెసేజ్ వచ్చినట్లు అనిపించి, మెసేజ్‌ను చదువుదామని అనుకుంటూ ఫోన్‌ను చేతిలోకి తీసుకున్నా. వివిధ ప్రముఖుల ఫొటోలతో పాటు వారు వివిధ సందర్భాల్లో చెప్పిన ప్రముఖ వాఖ్యలు కూడా అందులో ఉన్నాయి. అందులో ప్రియాంకా గాంధీ ఫొటో కూడా ఒకటి. ఆ ఫొటో పక్కనే ఉన్న వాఖ్యలు చదవడం కోసం నేను జూమ్ చేయాల్సి వచ్చింది. అంతేతప్ప నాకు మరే ఇతర ఉద్దేశం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు.’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా బుధవారం రోజే బీజేపీకు చెందిన మరో శాసనసభ్యుడు యూబీ బణకార్ (హిరేకెరూర్) తన సెల్ఫోన్లో చట్టసభలోనే క్యాండీక్రాష్ (ఓ మొబైల్ గేమ్) ఆడుతూ స్పీకర్ కాగోడు తిమ్మప్ప కంటబడ్డారు. దీంతో మార్షల్ వచ్చి ఇది సరికాదని చెప్పడంతో సర్దుకున్నారు. అయితే ఈ విషయం అప్పటికే మీడియాలో ప్రసారం అయిపోయింది. కాగా, గత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు నీలిచిత్రాలను చూస్తూ మీడియా కంటపడిన విషయం తెలిసిందే. అమ్మాయిల ఫొటోలు చూడటం వారి సంసృతి : సీఎం సిద్ధు శాసనసభ సమావేశంలో చౌహాన్ ప్రవర్తనపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చట్టసభల్లో అమ్మాయిల ఫొటోలను చూడటం వారి సంసృతి. ప్రియాంకాగాంధీతో సహా ఏ అమ్మాయిని కూడా అలా చూడటం సరికాదు. శాసనసభలోకి సెల్ఫోన్లను అనుమతించడం, అనుమతించకపోవడం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.’ అని పేర్కొన్నారు. కాగా, చట్టసభల్లోకి సెల్ఫోన్లను తీసుకురాకుండా కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావాల్సి ఉందని టీబీ జయచంద్ర ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు. వినూత్న నిరసన... : బుధవారం ఉదయం శాసనసభలో కార్యకలాపాలు మొదలైన వెంటనే ప్రభుచౌహాన్ తన నియోజక వర్గంలో అనర్హత పేరుతో పేదల బీపీఎల్ కార్డులనూ రద్దు చేస్తోందని ఆరోపిస్తూ గంపలో కొన్ని బీపీఎల్ కార్డులను వేసుకుని సభలోకి ప్రవేశించారు. విషయం గమనించిన స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఇలా చేయడం తగదని హితవు పలికారు. అప్పటికి మిన్నకుండిపోయిన ప్రభుచౌహాన్ కొంత సమయం తర్వాత రద్దయిన బీపీఎల్ కార్డులను తన దుస్తులపై పిన్నీలు, ప్లాస్టర్ సహాయంతో అతికించుకుని నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ శాసనసభలో సమస్యల ప్రస్తావన హుందాగా ఉండాలి. ఇలాగే ప్రవర్తించాలి అనుకుంటే బయటికి వెళ్లిపోండి’ అని హెచ్చరించారు.