కోర్టు తీర్పు షాక్‌కు గురిచేసింది: ప్రియాంక | Sakshi
Sakshi News home page

కోర్టు తీర్పు షాక్‌కు గురిచేసింది: ప్రియాంకా గాంధీ

Published Fri, Aug 16 2019 4:11 PM

Priyanka Gandhi Shocked On Pehlu Khan lynching case - Sakshi

రాజస్థాన్‌: పెహ్లూఖాన్‌ అనే పాలవ్యాపారిపై మూకదాడికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను అల్వార్‌ జిల్లాలోని స్థానిక కోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ప్రియాంకా గాంధీ వాద్రా విచారం వ్యక్తం చేశారు. 2017 ఏప్రిల్1న జైపూర్ నుండి ఆవులను కబేళాకు తరలిస్తున్నాడనే అనుమానంతో ఖాన్‌పై మూకదాడి జరిగింది. ఈ దాడిలో పెహ్లూఖాన్‌ చనిపోయాడు. ఈ సంఘటన జరిగిన  సమయంలో ఖాన్‌తో పాటు  అతని ఇద్దరు కుమారులు అక్కడే ఉన్నారు. మూకదాడి చేసిన నిందితులకు శిక్ష పడాలని బాధిత వర్గాలు ఎంత పోరాటం చేసినా ఫలించలేదు. చివరికి స్థానిక కోర్టు కూడా బాధితులకు షాక్‌ ఇచ్చింది. వారిని నిర్ధోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరుగుతుందని భావించానని, కోర్టు తీర్పు విస్మయానికి గురి చేసిందని ప్రియాంకా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు తనను షాక్‌కు గురిచేసిందని ఆమె ట్వీట్‌ చేశారు.

కాగా రాజస్థాన్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని మూకదాడులకు వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా ఆగస్టు 5న చట్టం తీసుకొచ్చింది. మూకదాడిలో పాల్పడ్డవారికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌, జీవిత ఖైదుతో పాటు ఐదు లక్షల జరిమానా వేసేందుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. రాజస్థాన్‌ ప్రభుత్వం ఈ అంశం పట్ల స్పందిస్తూ, మా ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిందని బాధతులకు అండగా ఉంటామని నిర్దోషులుగా ప్రకటించిన వారిపై హైకోర్టుకు వెళ్తామని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement
Advertisement