ప్రసూతి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం | President's approval to the Maternity Act | Sakshi
Sakshi News home page

ప్రసూతి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

Mar 30 2017 2:50 AM | Updated on Aug 8 2018 6:12 PM

ప్రసూతి సెలవులను 12 వారాలు నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం–2017కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు.

న్యూఢిల్లీ: ప్రసూతి సెలవులను 12 వారాలు నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం–2017కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న 18లక్షల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చట్టం ద్వారా ప్రపంచంలో ప్రసూతి సెలవులు ఎక్కువ ఇచ్చిన దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో నిలుస్తుంది.

కొత్త చట్టం ప్రకారం 50 లేదా అంత కంటే ఎక్కువ మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థలు వారి పిల్లల కోసం కచ్చితంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement