‘‘జియో’కు ఆ హోదా ఇవ్వలేదు’

Prakash Javadekar Says Institution Of Eminence Tag Not given to Jio Institute - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జియో ఇన్‌స్టిట్యూట్‌కు ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’ (ఘనత వహించిన లేదా అత్యున్నత) హోదా కల్పించలేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ రాజ్యసభలో వెల్లడించారు. కనీసం భవనం కూడా లేని ‘జియో ఇన్‌స్టిట్యూట్‌’ కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కల్పించిన ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఘనత వహించిన లేదా అత్యున్నత)’ హోదా సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయమై స్పష్టతనివ్వాల్సిందిగా పలువురు ఎంపీలు ప్రశ్నించడంతో.. జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఎటువంటి హోదా కల్పించలేదని ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు.

కమిటీ ప్రతిపాదనల మేరకే..
నిపుణుల కమిటీ ప్రతిపాదనల మేరకు జయో ఇన్‌స్టిట్యూట్‌కు హోదా కల్పించే విషయాన్ని పరిగణనలోకి మాత్రమే తీసుకున్నామని పేర్కొన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌- బెంగళూరు, ఢిల్లీ ఐఐటీ, ఐఐటీ బాంబేలకు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’ హోదా కల్పించామన్నారు. బిట్స్‌ పిలానీ, మణిపాల్‌ అకాడమీ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఈ హోదా ఇవ్వాల్సిందిగా కొన్ని షరుతులతో కూడిన ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని స్పష్టం చేశారు. ఐఐటీ చెన్నై, జేఎన్‌యూలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించగా.. ఆ విషయాన్ని కమిటీ సిఫారసుల మేరకే హోదా కల్పిస్తామని పేర్కొన్నారు.

చదవండి : రిలయెన్స్‌ మీద అంత మోజెందుకు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top