
రాహుల్ భద్రత మరింత కట్టుదిట్టం
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
లఖిమ్‌పూర్ ఖేరి (యూపీ): ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ రోడ్‌షోలో రాహుల్ గాంధీపై హరిఓం మిశ్రా అనే జర్నలిస్టు బూటు విసిరిన నేపథ్యంలో మంగళవారం ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాహుల్ చేపట్టిన 2,500 కి.మీ.ల కిసాన్ యాత్రలో భాగంగా మంగళవారం ఇక్కడ రోడ్‌షో కొనసాగింది. ప్రదాని మోదీ రైతులు, దళితులు, నిరుద్యోగుల గురించి మరిచి పోయారని.. కేవలం 15-20 మంది కోసమే పనిచేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు.