ట్రంప్‌ ఆగ్రా పర్యటన.. మోదీ వెళ్లరు

PM Modi Will Not Accompany Trumps To Agra, Sources Says - Sakshi

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రా సందర్శిస్తారని మీడియాలో వస్తున్న వార్తల్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి ఆగ్రా సందర్శనకు వెళ్లబోవడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, మొదటి మహిళ మెలానియా ఆగ్రా సందర్శనలో భారత్‌ తరపున ఓ ఒక్క అధికారిక ప్రతినిధి కూడా భాగం కావటం లేదని అధికారిక వర్గాల సమాచారం. ప్రధాని మోదీ, ట్రంప్‌తో కలిసి ఈ నెల 24న అహ్మదాబాద్‌లో పర్యటిస్తారని, అనంతరం 25 ఢిల్లీలో జరగనున్న అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. (ట్రంప్‌ భారత్‌ టూర్‌లో రాజభోగాలు)

ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు ఆయన భార్య, అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్‌, కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్‌, అల్లుడు జరెద్‌ కుష్‌నర్‌తో పాటు పెద్ద సంఖ్యలో అమెరికా అధికారులు భారత్‌కు వస్తున్నారు. పర్యటనలో భాగంగా మెలానియా ట్రంప్‌ ఢిల్లీలోని ఓ స్కూల్‌లో జరగబోయే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌, ఉపముఖ్యమంత్రి మనిష్‌ సిసోడియా పాల్గొనాల్సి ఉండింది. అయితే కేజ్రివాల్‌, మనిష్‌ సిసోడియాలు తమ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారిక సమాచారం.

చదవండి : ఆ అంశాల గురించి ట్రంప్‌ చర్చిస్తారు: అమెరికా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top