ప్రిన్స్ దంపతులకు ప్రధాని విందు | PM dinner to Prince couple | Sakshi
Sakshi News home page

ప్రిన్స్ దంపతులకు ప్రధాని విందు

Apr 13 2016 1:15 AM | Updated on Aug 15 2018 6:32 PM

ప్రిన్స్ దంపతులకు ప్రధాని విందు - Sakshi

ప్రిన్స్ దంపతులకు ప్రధాని విందు

బ్రిటన్ యువరాజు విలియం, కేట్ మిడిల్టన్‌లకు ప్రధాని మోదీ మంగళవారం హైదరాబాద్ హౌస్‌లో మధ్యాహ్న విందు ఇచ్చారు.

న్యూఢిల్లీ: బ్రిటన్ యువరాజు విలియం, కేట్ మిడిల్టన్‌లకు ప్రధాని మోదీ మంగళవారం హైదరాబాద్ హౌస్‌లో మధ్యాహ్న విందు ఇచ్చారు. ఇండియా గేట్ పక్కనేవున్న ఈ  భవంతిలో విలియం జంటకు మోదీ స్వాగతం పలికారు. భారత శాకాహార, మాంసాహార వంటకాల్ని వడ్డించారు. సంతూర్ వాద్యకారుడు రాహుల్ శర్మ ఈ విందులో వీనులవిందైన సంగీతం వినిపించారు.

బీటిల్స్ గీతం ‘లెట్ ఇట్ బీ’ ఆకర్షణగా నిలిచింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సమాచార, ప్రసార సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. కాగా, విలియం జంట ఢిల్లీ నుంచి మంగళవారం సాయంత్రం అస్సాం చేరుకుంది. తేజ్‌పూర్‌లో సీఎం తరుణ్ గొగోయ్ ఘనస్వాగతం పలికారు. అస్సాం పర్యటనలో ఈ జంట ఒంటి కొమ్ము రైనోలకు ప్రసిద్ధి చెందిన కజిరంగ జాతీయ పార్కును సందర్శిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement