విద్యార్థిపై పీఈటీ లైంగిక వేధింపులు.. | PET arrested on charge of sexual harassment of student | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై పీఈటీ లైంగిక వేధింపులు..

Aug 11 2017 1:31 PM | Updated on Jul 23 2018 9:15 PM

విద్యార్థిపై పీఈటీ లైంగిక వేధింపులు.. - Sakshi

విద్యార్థిపై పీఈటీ లైంగిక వేధింపులు..

విద్యార్థులను క్రమశిక్షణతో ఉంచాల్సిన పీఈటీ టీచరే క్రమశిక్షణ తప్పాడు.

చెన్నై: విద్యార్థులను క్రమశిక్షణతో ఉంచాల్సిన పీఈటీ టీచరే క్రమశిక్షణ తప్పాడు.  క్రీడల్లో మెళుకువలు నేర్పిస్తూ వారిని మానసికంగా ధృడంగా మార్చాల్సిన గురువే బాధ్యత మరిచి ఓ విద్యార్థిని లైంగికంగా వేధించాడు. తమిళనాడు భవానీ జిల్లాలోని అమ్మాపేట్‌ ప్రభుత్వ ఎయిడేడ్‌ పాఠశాల్లో పీఈటీగా పనిచేస్తున్న ప్రభూ(40) 8 వతరగతి చదువుతన్న పాఠశాల కబడ్డీ క్రీడాకారిణిని లైంగిక వేధించాడు. పక్క గ్రామంలో జరిగిన టోర్నమెంట్‌కు పాఠశాల కబడ్డీ జట్టు పాల్గొంది. 
 
తిరిగి వచ్చే క్రమంలో బస్సులో తనపై పీఈటీ ప్రభూ లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆ క్రీడాకారిణి తల్లితండ్రులకు ఏడుస్తూ తెలిపింది.  వెంటనే ఆమె తల్లితండ్రులు గ్రామ ప్రజులకు తెలియజేయడంతో 200 మంది బుధవారం పాఠశాల ముందుకు చేరి టీచర్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు పీఈటీ ప్రభూను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పీఈటీని సస్పెండ్‌ చేసినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement