రైలులో ప్రయాణికుడు మృతి | passenger died in train | Sakshi
Sakshi News home page

రైలులో ప్రయాణికుడు మృతి

Feb 25 2015 7:43 PM | Updated on Sep 2 2017 9:54 PM

రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీకి చెందిన తీర్ధయాత్రల ప్రత్యేక రైలులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.

మట్టెవాడ(వరంగల్): రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీకి చెందిన తీర్ధయాత్రల ప్రత్యేక రైలులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన యాత్రికుల బృందం ప్రత్యేక రైలులో వారణాసి తదితర క్షేత్రాలను సందర్శించుకుని తిరుగు ప్రయాణమైంది. బృందంలో ఒకడైన ఓజారు ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం(58) బల్లార్షా దాటిన తర్వాత తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఇది తెలుసుకున్న రైల్వే పోలీసులు తమిళనాడులోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తర్వాతి స్టాప్ వరంగల్‌లో రైలు ఆగిన తర్వాత రైలులో ప్రయాణిస్తున్న సంబంధీకులకు సుబ్రమణ్యం మృతదేహాన్ని అప్పగించారు. దీంతో వారు ప్రత్యేక అంబులెన్సులో తమిళనాడుకు బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement