దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకల ద్వారా అన్ని బీజేపీయేతర, ఎన్డీఏయేతర పార్టీలను లౌకికవాదం గూటికి చేర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకల ద్వారా అన్ని బీజేపీయేతర, ఎన్డీఏయేతర పార్టీలను లౌకికవాదం గూటికి చేర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. నెహ్రూ వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన బీజేపీ వ్యతిరేకులనే ఆహ్వానించింది.
వామపక్ష పార్టీలు, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ సహా లౌకికవాద సిద్ధాంతాన్ని విశ్వసించే వారిని సదస్సుకు పిలిచింది. ద న్యూఢిల్లీ కాన్ఫరెన్స్ పేరిట నిర్వహిస్తున్న ఈ సదస్సులో సమ్మిళిత ప్రజాస్వామ్యం, ప్రజల సాధికారత, 21వ శతాబ్దానికి నెహ్రూ ఆలోచనా విధానం అనే అంశాలపై చర్చ జరగనుంది.