బాలాకోట్‌ షాక్‌ నుంచి తేరుకోని పాక్‌..

Pakistan Yet To Recover From Balakot Airstrike Impact - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా దాడికి ప్రతిగా భారత వైమానిక దళం చేపట్టిన బాలాకోట్‌ మెరుపు దాడుల ప్రభావం నుంచి పాకిస్తాన్‌ ఇంకా తేరుకోలేదు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత మెరుపు దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన పాకిస్తాన్‌ అధికారులు సరిహద్దు ప్రాంతంలో వారి గగనతలాన్ని మూసివేయగా, భారత సరిహద్దుల వెంబడి పాక్‌ తన సేనలను మోహరించింది.

నూతన రక్షణ వ్యూహాల్లో భాగంగా పాక్‌ సేనలు వ్యూహాత్మక స్ధావరాల్లో సాయుధ వాహనాలను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఫిబ్రవరి 26న వైమానిక దళం బాలాకోట్‌లో మెరుపు దాడులు చేసినప్పటి నుంచి పాకిస్తాన్‌ సైన్యం అప్రమత్తమైందని సమాచారం. భారత్‌ యుద్ధ విమనాలను సరిహద్దు పోస్టుల నుంచి మళ్లిస్తేనే తమ గగనతలాన్ని ఓపెన్‌ చేస్తామని పాకిస్తాన్‌ అధికారులు ఇటీవల తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top