1500 పోస్టులు... 5 లక్షల దరఖాస్తులు
కేరళ పబ్లిక సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహిస్తున్న పరీక్షలకు దాదాపు 5 లక్షల 17 వేల 6 వందల మందియ అభ్యర్థులు హాజరుకానున్నారు.
తిరువనంతపురం: కేరళ పబ్లిక సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహిస్తున్న పరీక్షలకు దాదాపు 5 లక్షల 17 వేల 6 వందలమంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ముఖ్యంగా సెక్రటేరియట్ అసిస్టెంట్ తో పాటు 1500 ఉద్యోగాల ఎంపిక కోసం, 2,121 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 37 సంవత్సరాల గరిష్ట వయసు, గ్రాడ్యుయేషన్ కనీస విద్యార్హత ఎంపికకు ప్రామాణికంతో ప్రతి రెండేళ్లకోసారి ఈ ఎంపిక ఉంటుంది.
ఈ ఉద్యోగాన్ని ఎలాగైనా సాధించాలని ప్రతి కేరళీయుడు కోరుకుంటాడని .. ఇదొక డ్రీమ జాబ్ అని అభ్యర్థులంటున్నారు.
అదండీ సంగతి. ప్రభుత్వ ఉద్యోగాలకున్న క్రేజ్ అలాంటిది మరి.. గవర్నమెంటు ఉద్యోగం వస్తే చాలు కాలు మీద కాలు వేసుకొని బతికేయొచ్చని ఆశపడే నిరుద్యోగులు ఎంత మంది లేరు చెప్పండి!!


