దేశంలో 24,37,96,693 మందికి పైగా ప్రజలు శాశ్వత అకౌంట్ నంబర్(పాన్)ను నమోదు చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
24.37 కోట్ల మందికి పాన్ కార్డులు
Feb 25 2016 10:15 AM | Updated on Sep 3 2017 6:25 PM
న్యూఢిల్లీ: దేశంలో 24,37,96,693 మందికి పైగా ప్రజలు శాశ్వత అకౌంట్ నంబర్(పాన్)ను నమోదు చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగలు, రూ.2 లక్షలకు మించి కొనుగోళ్లు తదితర ఆర్థిక లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ‘ఈ-బిజినెస్’ ప్రత్యేక పోర్టల్ ద్వారా యునిక్ కార్డు అప్లికేషన్లు తీసుకోవడంతో పాటు డిజిటల్ సంతకాన్ని నమోదు చేసే ఆలోచనల్లో ఉన్నట్లు చెప్పారు. పాన్ నమోదు కోసం ఇకపై నగరేతర ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్లు వివరించారు.
Advertisement
Advertisement