నాకు చెప్పకుండా సుప్రీంకు వెళతారా?

No Other Way Than Implementing Citizenship Act - Sakshi

సీఏఏపై పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ సీరియస్‌

తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తనకు సమాచారం ఇవ్వకుండానే సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు ఈ నెల 13వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై గవర్నర్‌   అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కొనసాగేలా చేయడం తన బాధ్యతని, ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోబోనని బెంగళూరులో ఆయన వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top