ముంబై యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లర్నింగ్ బుక్స్ లో ఉన్న అంశాలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. నెహ్రూకు సంబంధించిన విషయాలను వదిలేశారు. మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ లను లౌకిక వాదానికి వ్యతిరేకమని పాఠ్య పుస్తకాల్లో ఉంది.
మహాత్మా గాంధీ,తిలక్ లు లౌకిక వాదానికి వ్యతిరేకులు
May 18 2016 8:29 PM | Updated on Sep 4 2017 12:23 AM
	ముంబై: ఇటీవల రాజస్థాన్ లోని పాఠ్యపుస్తకాల్లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కు సంబంధించిన వివాదం ఇంకా మరచిపోకముందే మరో వివాదం మొదలైంది. ముంబై యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లర్నింగ్ బుక్స్ లో ఉన్న అంశాలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. నెహ్రూకు  సంబంధించిన విషయాలను వదిలేశారు.  మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ లను లౌకిక వాదానికి వ్యతిరేకమని పాఠ్య పుస్తకాల్లో ఉంది.
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	యూనివర్సిటీకి చెందిన సివిక్స్, పాలిటిక్స్ డిపార్ట్ మెంట్  ఈ బుక్కును సంకలనం చేసింది. ఇటీవల రాజస్థాన్ లోని ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకాల్లో జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉండంటం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాషాయీకరనలోభాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించింది.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
