కన్నడ ఎమ్మెల్యేలకు బంగారు బిస్కెట్లు లేనట్లే!

no gold biscuits for mlas in karnataka - Sakshi

విమర్శలతో వెనక్కు తగ్గిన సీఎం సిద్దరామయ్య

బెంగళూరు: కర్ణాటక విధాన సౌధ భవన వజ్రోత్సవాల (60 ఏళ్లు) సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల ఖర్చును భారీగా తగ్గించుకోవాలని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. రెండ్రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ముందుగా భావించారు. ఈ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బంగారు బిస్కెట్లు, ఉద్యోగులకు వెండి ప్లేట్లు ఇవ్వాలని, ఇతర కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు కలిపి రూ. 26 కోట్లు ఖర్చుచేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో వెనక్కు తగ్గిన సీఎం సిద్దరామయ్య.. ఎమ్మెల్యేలకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదని, రెండ్రోజుల వేడుకలను ఒక్కరోజుకే కుదించి రూ.10కోట్లతోనే ఖర్చులను సరిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 25న రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ కర్ణాటక ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 1951లో ఈ భవనానికి అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేయగా 1956లో నిర్మాణం పూర్తయింది. ఇందుకు అయిన మొత్తం ఖర్చు రూ.1.84 కోట్లు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top