ఈ నెల 31లోగా ఎస్‌టీబీ అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
'సెట్ టాప్ బాక్స్‌లపై పొడిగింపు లేదు'
Jan 25 2017 4:08 PM | Updated on Sep 5 2017 2:06 AM
ఢిల్లీ: జనవరి 31వ తేదీ లోగా పట్టణ ప్రాంత వినియోగదారులు కచ్చితంగా సెట్‌టాప్‌బాక్స్(ఎస్‌టీబీ) అమర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడో దశ డిజిటైజేషన్ కింద ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 31లోగా ఎస్‌టీబీ అమర్చుకుని ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు అమర్చుకోలేని కేబుల్ వినియోగదారులు వెంటనే తమ కేబుల్ ఆపరేటర్ నుంచి ఎస్‌టీబీలు పొందాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కోరింది.
ఎస్‌బీటీలు అమర్చుకోని వినియోగదారులకు కేబుల్ టీవీ ప్రసారాలను వీక్షించే వీలుండదని పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు తమ పరిధిలో ఈ మేరకు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కోరింది. జనవరి 31వ తేదీ తర్వాత ఎస్‌టీబీలు లేకుండా అనలాగ్ సంకేతాలు ప్రసారం కాబోవని మల్టీ సిస్టం ఆపరేటర్లు(ఎంఎస్‌వోలు), లోకల్ కేబుల్ ఆపరేటర్లు(ఎల్‌ఎస్‌వో)లకు స్పష్టం చేసింది.
Advertisement
Advertisement