నేడు నీతి ఆయోగ్‌  | NITI Aayog Meeting Is Conducted Today | Sakshi
Sakshi News home page

Jun 17 2018 2:07 AM | Updated on Aug 15 2018 2:40 PM

NITI Aayog Meeting Is Conducted Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆదివారం(17న) సమావేశం కానుంది. ఇక్కడి రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4 వరకు సమావేశం జరగనుంది. పాలకమండలి చైర్మన్‌గా ఉన్న ప్రధాని సహా మండలి సభ్యులైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. కేసీఆర్‌ గురువారమే ఢిల్లీకి వెళ్లగా, చంద్రబాబు శనివారం సాయంత్రం దేశ రాజధానికి చేరుకున్నారు. గత సమావేశ నిర్ణయాల అమలు, రైతుల ఆదాయం రెట్టింపు, ఆయుష్మాన్‌ భారత్, పోషణ్‌ మిషన్, మిషన్‌ ఇంద్రధనుష్, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.   

Advertisement
 
Advertisement
Advertisement