సురేందర్ కోలీకి రేపే ఉరి? | Nithari killer Surender Koli to be hanged Monday? | Sakshi
Sakshi News home page

సురేందర్ కోలీకి రేపే ఉరి?

Sep 7 2014 7:30 PM | Updated on Sep 2 2017 1:01 PM

సురేందర్ కోలీకి రేపే ఉరి?

సురేందర్ కోలీకి రేపే ఉరి?

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిఠారీ’ కేసుల నిందితుడు సురేందర్ కోలీకి సోమవారం ఉదయం ఉరిశిక్ష పడే అవకాశం ఉందని మీరట్ జైలు అధికారులు తెలిపారు

మీరట్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిఠారీ’ కేసుల నిందితుడు సురేందర్ కోలీకి సోమవారం ఉదయం ఉరి తీసే అవకాశం ఉందని మీరట్ జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెప్టెంబర్ 4 తేదిన కోలీని  గజియాబాద్ లోని దస్నా జైలు నుంచి మీరట్ జైలుకు తరలించారు. 
 
సెప్టెంబర్ 7 తేది నుంచి 12 తేది లోపల ఏ రోజైనా ఉరితీసే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే కోలీ ఉరిపై అధికారుల నోరు మెదపనప్పటికి.. సోమవారం ఉదయం 5.30 నిమిషాలకు ఉరి తీసే అవకాశముందనే వార్తలు వెలువడుతున్నాయి. నైనీ సెంట్రల్ జైలు నుంచి ఉరితాడు.. కొక్కెం జైలు అధికారులకు అందాయని మీరట్ జైలు సూపరింటెండెంట్ ఎస్ఎమ్ రిజ్వీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement