హెర్బల్‌ టీతో కరోనాకి చెక్‌!

NIPER, Mohali Come Up with Herbal Tea To Fight with Corona - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు చెక్‌పెట్టే ఏ ఔషధాన్ని కనిపెట్టలేదు. మాస్క్‌లు, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ మహమ్మరి నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. కరోనాపై పోరాటంలో భాగంగా మొహాలిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌ఐపీఈఆర్‌) సెఫ్టీ డివైజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు తయారు చేస్తూ అండగా నిలుస్తోంది. (శుభపరిణామం: మరింత పెరిగిన రికవరీ)

అయితే ఇప్పుడు తాజా కరోనాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్‌ టీని తయారు చేసింది. ఇంతవరకు కరోనాకు ఎటువంటి మందు లేకపోవడంతో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే మనం కరోనాతో పోరాడగలం. మనకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోగలుగుతాం. ఈ హెర్బల్‌ టీని ‍స్థానికంగా అందుబాటులో ఉండే  ఆరు రకాల హెర్బల్స్‌ అశ్వగంధ, తిప్పతీగ, ములేటి, తులసి, గ్రీన్‌టీని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. వీటిని తగిన పాళ్లలో కలిపి ఈ హెర్బల్‌ టీని  తయారు చేసుకోవాలి. దీనిని రోజుకు మూడు సార్లు తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. (నాలాగా కోవిడ్‌ బారిన పడకండి: ఎమ్మెల్యే)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top