పెళ్లి నుంచి నేరుగా ఓటేయడానికి.. | Sakshi
Sakshi News home page

పెళ్లి నుంచి నేరుగా ఓటేయడానికి..

Published Thu, Apr 18 2019 12:02 PM

Newly married couple cast vote in Udhampur - Sakshi

శ్రీనగర్‌ : ఎన్ని పనులున్నా ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో పెళ్లి నుంచి నేరుగా ఓ కొత్త జంట ఓటు వేయడానికి పోలింగ్‌ బూత్‌కు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని ఉదంపుర్‌ పోలింగ్‌ బూత్‌కు పెళ్లి దుస్తుల్లోనే వచ్చిన ఈ జంటకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలో వైరల్‌ అవుతోంది. కొత్తజంటకు వివాహ శుభాకాంక్షలు చెబుతూ, ఓటు హక్కును తప్పకుండా ప్రతిఒక్కరు వినియోగించుకునేలా ఈ జంట అందరికీ స్పూర్తినిస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  

కాగా, దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభంమైన పోలింగ్‌ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement