
న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) చందాదారుల నుంచి ఆధార్ వివరాలు సేకరించేందుకు వీలుగా సోమవారం నుంచి కొత్త దరఖాస్తు పత్రాలను వినియోగించాలని పీఎఫ్‌ఆర్‌డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) బ్యాంకులు, పోస్టాఫీసులను కోరింది. దీనిపై గతంలో అనేకసార్లు ఆర్థిక సేవల విభాగం, బ్యాంకులు, పోస్టాఫీసుల అధికారులతో చర్చలు జరిపామనీ, జనవరి 1 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించామని పీఎఫ్‌ఆర్‌డీఏ వెల్లడించింది.