అత్తను చంపి.. కట్టు కథలు చెప్పి.. | Nephew kills aunt after resisting molestation in Delhi | Sakshi
Sakshi News home page

అత్తను చంపి.. కట్టు కథలు చెప్పి..

Sep 17 2016 12:26 PM | Updated on Sep 4 2017 1:53 PM

అత్తను చంపి.. కట్టు కథలు చెప్పి..

అత్తను చంపి.. కట్టు కథలు చెప్పి..

పోలీసులను, దర్యాప్తును పక్కదోవపట్టించే ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. తన అత్తను గొంతు నులిమి చంపి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా కట్టుకథలు, పిట్ట కథలు చెప్పాడు.

న్యూఢిల్లీ: పోలీసులను, దర్యాప్తును పక్కదోవపట్టించే ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. తన అత్తను గొంతు నులిమి చంపి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా కట్టుకథలు, పిట్ట కథలు చెప్పాడు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత మరోసారి అతడిని పిలిచి ప్రశ్నించిన పోలీసులు అతడు సమాధానం చెప్పిన తీరును అనుమానించి అసలు విషయం రాబట్టారు. అతడే ఆమెను చంపినట్లు అతడి నోటితోనే ఒప్పించారు. పూర్తి వివారాల్లోకి వెళితే.. ఉత్తర ఢిల్లీలోని అమన్ విహార్ ప్రాంతంలోగల శివారులో ఓ నివాసం ఉంది. అక్కడ చింటూ అనే యువకుడు అత్తయ్య, మామయ్యతో కలసి ఉంటున్నాడు.

ఇటీవల బిహార్ నుంచి వాళ్లింటికి వచ్చాడు. మామయ్య ఆఫీస్ కు వెళ్లింది చూసి ఆమెను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడు. దానిని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతోపాటు మామయ్యకు చెప్తానని, చుట్టుపక్కల వారికి తెలియజేస్తానని చెప్పడంతో బెదిరిపోయిన చింటూ ఆమె గొంతు నులిమి చంపాడు. అనంతరం తెలివిగా తానే పోలీసులకు ఫోన్ చేసి తాము బయట ఆడుకుంటుంటే అత్తయ్య మెట్లపై నుంచి కిందపడి పోయిందని, వచ్చి చూసేవరకు స్పృహ కోల్పోయి కనిపించిందని కట్టుకథలు చెప్పాడు. చివరకు అతడి ఎత్తులు పోలీసుల ముందు చిత్తయ్యాయి. అరెస్టు చేసి కోర్టుకు తరలించగా నేరాన్ని అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement