ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్ దత్ తివారీని శుక్రవారం రాత్రి ఆయన ఒకప్పటి సహచరి ఉజ్వలా శర్మ కలిశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్ దత్ తివారీని శుక్రవారం రాత్రి ఆయన ఒకప్పటి సహచరి ఉజ్వలా శర్మ కలిశారు. తివారీని కలిసేందుకు లక్నోలోని ఆయన నివాసానికి వచ్చిన ఉజ్వలను తొలుత తివారీ భద్రతాధికారి భవానీ భట్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె తివారీ ఇంటి ముందు బైటాయించారు.
స్వల్ప వాగ్వాదం తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు వచ్చి ఉజ్వలను లోపలికి తీసుకెళ్లి తివారీతో మాట్లాడించారు. ఢిల్లీకి చెందిన మాజీ ప్రొఫెసర్ అయిన ఉజ్వలా శర్మకు తివారీ ద్వారా గతంలో రోహిత్ శేఖర్ అనే ఓ కుమారుడు జన్మించగా.. కోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాతే ఆయన ఇటీవల రోహిత్‌ను జన్యుపరమైన కుమారుడిగా అంగీకరించిన విషయం తెలిసిందే.