జైలులో ముంబై పేలుళ్ల దోషి మృతి

Mumbai Serial Blast Convict Yusuf Memon Deceased - Sakshi

ముంబై : 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న యూసఫ్‌​ మెమన్‌ శుక్రవారం మృతిచెందాడు. మహారాష్ట్ర నాసిక్‌ రోడ్డు జైలులో యూసఫ్‌ మృతి చెందినట్టు జైలు అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని నాసిక్‌ పోలీసు కమిషనర్‌ విశ్వాస్‌ నాంగ్రే పాటిల్‌ కూడా ధ్రువీకరించారు. అయితే యూసఫ్‌ మృతికి గల కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం అతని మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ధూలేకి తరలించారు. ముంబై పేలుళ్ల మాస్టర్‌ మైండ్, ప్రస్తుతం పరారీలో ఉన్న‌ టైగర్‌ మెమన్‌కు యూసఫ్‌ సోదరుడనే సంగతి తెలిసిందే. కాగా, స్పెషల్‌ టాడా కోర్టు ఈ కేసులో యూసఫ్‌కు జీవిత ఖైదు విధించింది.

1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 250 మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు. కాగా, ఈ కేసులో దోషిగా ఉన్న టైగర్‌ మెమన్‌ మరో సోదరుడు యాకుబ్‌కు 2015లో ఊరి శిక్ష అమలైన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top