‘బాలీవుడ్ సెలబ్రీటీలంతా డ్రగ్స్‌ బాధితులే’

MLA Manjinder Sirsa Accuses Deepika Padukone And Ranveer Singh Doing Drugs At Karan Johar Party - Sakshi

ముంబై : బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఇటీవల త‌న స్నేహితులకి ఇచ్చిన విందు రాజకీయ దుమారానికి దారి తీసింది. కొద్దిరోజల క్రితం కరణ్‌ తన స్నేహితులకు తన ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు.  ఈ పార్టీకి బాలీవుడ్ ప్ర‌ముఖులు దీపిక ప‌దుకొణే, ర‌ణ‌బీర్ క‌పూర్, షాహిద్ క‌పూర్, మీర్జా రాజ్‌పుత్‌, వ‌రుణ్ ధావ‌న్, న‌టాషా ద‌లాల్, మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. వీరంద‌రు సంద‌డి చేస్తుండ‌గా, వీడియోని తీసి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు క‌ర‌ణ్‌. ఇప్పుడు ఆ వీడియో కాంట్రావర్సీగా మారింది.

బాలీవుడ్‌ సెలబ్రీటీలంతా డ్రగ్స్‌ తీసుకుంటారని శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) ఎమ్మెల్యే మజీందర్‌ సింగ్‌ సిర్సా ఆరోపించారు. వారి రీల్‌ లైఫ్‌కి రియల్‌ లైఫ్‌కి చాలా తేడా ఉంటుందని, డ్రగ్స్‌ను సేవించామని గర్వంగా ఫీలవుతున్న బాలీవుడ్‌ సెలబ్రీటీలను చూడండంటూ కరణ్‌ జోహార్‌ తీసిన వీడియోను ట్విట్‌ చేశారు.

కాగా మజీందర్‌ ఆరోపణలను కాంగ్రెస్‌ నేత మిలింద్ డియోరా ఖండించారు. వారు డ్రగ్స్‌ సేవించలేదని, అనవసరంగా ఇతరుల ప్రతిష్టతలను దిగజార్చేలా మాట్లాడొద్దని సూచించారు. ఇలాంటి అరోపణలు చేసినందుకు వీడియో ఉన్న బాలీవుడ్‌ ప్రముఖులందరికి భేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ కరణ్‌ ఇచ్చిన పార్టీకి నా భార్య కూడా వెళ్లింది. అక్కడ ఎవరూ డ్రగ్స్‌ తీసుకోలేదు. దయచేసి ఇలాంటి అబద్దాలను ప్రచారం చేస్తూ.. ఇతరులను ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించకండి.  వారందరికి మీరు భేషరతుగా క్షమాపణ చెబుతారని ఆశిస్తున్నాను’ అని డియోరా ట్విట్‌ చేశారు. కాగా, వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు  డ్రగ్స్‌ తీసుకోలేదు సరదాగా పార్టీ చేసుకున్నారని కొందరు.. ఇది క్యాజివల్‌ పార్టీ కాదని, మందు పార్టీ అని మరి కొందరు ట్వీట్ చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top