‘యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయొద్దు’

Ministry of Health And Family Welfare Officials Press Meet On Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 979 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఇవాళ ఒక్కరోజే 106 కరోనా నమోదయ్యాయని చెప్పారు. దేశంలో కరోనాతో 25 మంది మృతిచెందారని తెలిపారు. వెంటిలేటర్లు, ఎన్‌-95 మాస్క్‌లు ఉత్పత్తి పెంచినట్టు తెలిపారు. దేశంలో నిత్యావసరాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. వలస కూలీలను ప్రయాణాలను ఆపేయాలని రాష్ట్రాలను ఆదేశించినట్టు చెప్పారు. ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయకూడదని అన్నారు. 

ఐసీఎంఆర్‌ ప్రతినిధి గంగా కేట్కర్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల ల్యాబ్‌లు పెంచామని తెలిపారు. ఇప్పటివరకు 34,931  మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 113 ల్యాబ్‌లకు అదనంగా మరో 47 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతిచ్చామని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top