ఏపీకి మరోసారి మొండిచేయి | Ministry of Finance Clarification on Special Status | Sakshi
Sakshi News home page

ఏపీకి మరోసారి మొండిచేయి

Mar 6 2018 6:18 PM | Updated on Mar 23 2019 9:10 PM

Ministry of Finance Clarification on Special Status - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఎన్ని పోరాటాలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని సూచనప్రాయంగా వెల్లడించింది. సెంటిమెంట్‌ ఆధారంగా నిర్ణయాలు తీసుకోబోమని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం అందుతోంది. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం​ ఇప్పట్లో కుదరదని, గతంలో ప్రకటించిన ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. నాలుగేళ్లలో ఏపీకి రూ. 12,500 కోట్లు ఇచ్చామని, ఒక్క రూపాయికి కూడా టీడీపీ ప్రభుత్వం లెక్కచెప్పలేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం.

ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్టు రాయితీలు ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఏపీకి కొత్తగా పన్నులు రాయితీలు ఇవ్వడం సాధ్యపడకపోవచ్చని స్పష్టం చేశాయి. ఆత్మగౌరవం పేరిట రాజకీయ సెగ రాజేసి ఏపీ నేతలు సతమవుతున్నారని పేర్కొన్నాయి. తెలుగు సెంటిమెంట్‌ అంటున్నారు తర్వాత తమిళం, మలయాళ సెంటిమెంట్‌ అంటారా అని ప్రశ్నించినట్టు సమాచారం.

మరోవైపు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో ఏపీ ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వరుసగా రెండోరోజు పార్లమెంట్‌ ఉభయ సభల్లో, ఢిల్లీలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement