వైరల్‌ వీడియో: ఇదీ మన ఆకలి భారతం

Migrant workers at a railway station Fight For Food - Sakshi

పట్నా : కరోనా నేపథ్యంలో పేదలు ఆకలికి అల్లాడుతున్నారు. కేంద్రం ఎన్ని ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినా.. వలస కూలీలకు అన్నం పొట్లం కూడా దొరకడంలేదు. ఆకలితో అలమటిస్తున్న కొందరికి దాతలు సహాయం చేస్తున్నా ఇంకా ఎంతోమంది ఎదురుచూస్తూనే ఉన్నారు. బుక్కెడు బువ్వ దొరికితే చాలు అనుకుంటూ దేవున్ని ప్రార్థస్తున్నారు. తాజాగా బిహార్‌లోని కతీహార్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన దేశంలో ఆకలి కేకలకు అద్దంపడుతోంది. అప్పుడే రైలు నుంచి దిగిన ఓ పెద్దాయన దగ్గరున్న అన్నం పొట్లాల కోసం వలస కూలీలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ తిండికోసం నానా తిప్పలు పడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ‘ఇదీ మన ఆకలి భారతం, హృదయ విదారకం’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. (దూరం 250 కిమీ.. టికెట్‌ ధర 12వేలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top