దుబాయ్ నుంచి 50 బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు.
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి 50 బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రత సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది.
సీఐఎస్ఎఫ్ అధికారులు కేరళకు చెందిన ఆష్రఫ్ను తనిఖీ చేయగా ఈ విషయం వెలుగు చూసింది. నిందితుడిని బంధించి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అతడి నుంచి 50 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. కస్టమ్స్ అధికారులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.