అది గ్రేట్‌ సెల్ఫిష్‌ ట్యాక్స్

Mamata Banerjee attacks PM Modi yet again, says GST is 'Great Selfish Tax' - Sakshi

సాక్షి,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ జీఎస్‌టీని గ్రేట్‌ సెల్ఫిష్‌ ట్యాక్స్‌గా అభివర్ణించారు. ప్రజలను వేధించేందుకు, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేందుకే దీన్ని ప్రవేశపెట్టారని ఆరోపించారు.పెద్ద నోట్ల రద్దు భారీ వైఫల్యమని, దీన్ని నిరసిస్తూ నవంబర్‌ 8న సోషల్‌ మీడియా యూజర్లు తమ  ప్రొఫైల్‌ పిక్చర్లను నలుపు చతురస్రాకారంగా (బ్లాక్‌ స్క్వేర్‌) మార్చాలని పిలుపు ఇచ్చారు.

ప్రజలను వేధించేందుకు, ఉద్యోగాలను బలితీసుకునేందుకు, వ్యాపారాలను ధ్వంసం చేసి ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసేందుకే గ్రేట్‌ సెల్ఫిష్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టారని మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు.నోట్ల రద్దు నిర్ణయానికి ఏడాది పూర్తవుతున్న నవంబర్‌ 8న ట్విట్టర్‌ డీపీలను నలుపు రంగులో మార్చాలని కోరారు.నోట్ల రద్దుకు నిరసనగా నవంబర్‌ 8న పశ్చిమ బెంగాల్‌ అం‍తటా బ్లాక్‌ డే పాటిస్తున్నట్టు తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top