అసభ్య ప్రవర్తనతో తన్నులు తిన్నాడు | Madhya Pradesh: Cousin misbehaves with sister, beaten up by mob | Sakshi
Sakshi News home page

అసభ్య ప్రవర్తనతో తన్నులు తిన్నాడు

Apr 28 2016 11:47 AM | Updated on Oct 8 2018 3:17 PM

అసభ్య ప్రవర్తనతో తన్నులు తిన్నాడు - Sakshi

అసభ్య ప్రవర్తనతో తన్నులు తిన్నాడు

మధ్యప్రదేశ్ లోని నీముచ్ ప్రాంతంలో జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

నీముచ్: మధ్యప్రదేశ్ లోని నీముచ్ ప్రాంతంలో జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దారుణం బయటకు వెల్లడైంది. సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడికి స్థానికులు దేహశుద్ధి చేసినప్పుడు తీసిన వీడియో ఇది.

వావివరసలు మర్చిపోయి సోదరిపై లైంగిక దాడికి యత్నించడంతో అతడిని చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. తనను బలవంతంగా లాక్కెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడని బాధితులు తెలిపింది. తన తల్లిదండ్రులు వారించినా వినకుండా తనను ఎత్తుకుపోయాడని వాపోయింది. స్థానికుల సహకారంతో అతడి బారి నుంచి తప్పించుకున్నానని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement