‘రూ . 36 వేల కోట్లు మింగేశారు’

 Loss Of Rs 36,000 Crore In Rafale Deal  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణంపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఈ స్కాంలో రూ 36,000 కోట్లు ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. సైన్యం రక్షణ కేటాయింపులపై ప్రాధేయపడుతుంటే ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడిందని దుయ్యబట్టారు. ఈ యుద్ధ విమానాలను తయారుచేసిన దాసాల్ట్‌ ఏవియేషన్‌ విమాన ఖరీదుపై భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అవాస్తవాలు చెప్పారని పేర్కొనడాన్ని రాహుల్‌ ప్రస్తావించారు.

 మోదీ ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని రూ 1670 కోట్లకు కొనుగోలు చేసిందని, ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్‌పై రూ1100 కోట్ల చొప్పున 36,000 కోట్లు వృధా అయ్యాయని ఆరోపించారు. రక్షణ బడ్జెట్‌లో పది శాతం వాటాను పాలకులు జేబులో వేసుకున్నారని విమర్శించారు. రాఫెల్‌ యుద్ధవిమానాల కుంభకోణంలో ప్రధాని మోదీ మౌనాన్ని రాహుల్‌ ప్రశ్నించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top