ఉడీ దాడి మా పనే: లష్కరే | Lashkar-e comment on Udi attack | Sakshi
Sakshi News home page

ఉడీ దాడి మా పనే: లష్కరే

Oct 26 2016 2:40 AM | Updated on Mar 23 2019 8:29 PM

జమ్మూకశ్మీర్‌లోని ఉడీలోని సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది తామేనని లష్కరేతోయిబా ప్రకటించింది.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని ఉడీలోని సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది తామేనని  లష్కరేతోయిబా ప్రకటించింది. గత నెలలో జరిగిన ఈ దాడిలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలాలో.. ఉడీ దాడులకు పాల్పడిన ఉగ్రవాది సంస్మరణార్థం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు లష్కరే మాతృసంస్థ అయిన జమాతుద్ దవా (జేయూడీ) తెలిపింది.

ఈమేరకు సామాజిక మాధ్యమంలో పోస్టర్లు విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సంస్మరణ ప్రార్థనల అనంతరం జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ ప్రసంగిస్తారని అందులో ఉంది. లష్కరే తోయిబాకు చెందిన మిలిటెంట్ ముహమ్మద్ అనాస్.. ఉడీలో భారత సైనిక శిబిరంపై దాడి చేసినప్పుడు ‘అమరుడయ్యాడు’ అని కూడా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement