బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ పట్నాలో 24గంటల నిరాహారదీక్ష చేస్తున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ శనివారం పట్నాలో 24 గంటల నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర భూ సేకరణ బిల్లుకు నిరసనగా గాంధేయ మార్గంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలన్న జేడీయు పిలుపులో భాగంగా ఆయన ఈ దీక్షకు కూర్చున్నారు. జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు బసిష్ట నారాయణ సింగ్, సీనియర్ మంత్రి విజయ్ చౌదరి, సీనియర్ నేత సంజయ్ ఝాతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దీక్షలో పాల్గొన్నారు.
అలాగే జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహిస్తున్టనలు జేడీయూ రాష్ట్ర అధ్యక్షడు నారాయణ తెలిపారు. మోదీ సర్కార్ కార్పొరేట్లకు దాసోహమంటూ రైతు వ్యతిరేక బిల్లు తీసుకొచ్చిందని ఆయన మండి పడ్డారు. ఈ బిల్లును ఉపసంహరించుకునేదాకా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాగా, ముఖ్యమంత్రి నితీశ్ భూ సేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో తన గళం వినిపించిన సంగతి తెలిసిందే.