ఉగ్రవాద కేసు నుంచి కోబాడ్‌కు విముక్తి | Kobad to be free from terror case | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద కేసు నుంచి కోబాడ్‌కు విముక్తి

Jun 11 2016 3:23 AM | Updated on Sep 4 2017 2:10 AM

ఉగ్రవాద కేసు నుంచి కోబాడ్‌కు విముక్తి

ఉగ్రవాద కేసు నుంచి కోబాడ్‌కు విముక్తి

మావోయిస్టు సిద్ధాంతకర్త కోబాడ్ గాంధీ(68)పై ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద నమోదైన కేసును ఢిల్లీ కోర్టు శుక్రవారం కొట్టివేసింది.

న్యూఢిల్లీ: మావోయిస్టు సిద్ధాంతకర్త కోబాడ్ గాంధీ(68)పై ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద నమోదైన కేసును ఢిల్లీ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. అయితే తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఢిల్లీలో నివసించిన కేసులో దోషిగా నిర్ధారించింది. నేరపూరిత కుట్ర, చీటింగ్, ఫోర్జరీకింద శిక్ష వేసింది.

కేసు విచారణలో భాగంగా కోబాడ్  ఆరున్నరేళ్లు జైల్లోనే ఉన్నందున శిక్షనుమినహాయిస్తూ కోర్టురూ. 40 వేల జరిమానా విధించింది. కోబాడ్‌తో పాటు మరో మావోయిస్టు నేత రాజిందర్ కుమార్‌ను కోర్టు దోషిగా నిర్ధారించినా, కస్టడీలోనే జైలు శిక్ష పూర్తవడంతో రూ. 20 వేల ఫైన్ విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement