కేరళ కాంగ్రెస్‌ చీఫ్‌ పరిస్థితి విషమం! | Kerala Congress(M) Chief KM Mani Reportedly In Serious Condition | Sakshi
Sakshi News home page

కేరళ కాంగ్రెస్‌ చీఫ్‌ పరిస్థితి విషమం!

Apr 8 2019 8:30 PM | Updated on Apr 8 2019 8:31 PM

Kerala Congress(M) Chief KM Mani Reportedly In Serious Condition - Sakshi

కొచ్చి: కేరళ కాంగ్రెస్‌(ఎం) అధ్యక్షుడు కేఎం మణి ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 86 ఏళ్ల మణికి కొచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చెస్ట్‌ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. అయితే మణి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, మణికి మెరగైన వైద్యం అందిస్తున్నామని ఆస్పత్రి హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. ఆయన 50 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కొట్టాయం పార్లమెంట్‌ స్థానం నుంచి ఆయన కేరళ కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్నారు. కానీ అనారోగ్యం కారణంగా ఆయన ప్రచారానికి దురంగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement