శివ కుమార స్వామిజీ శివైక్యం

Karnataka Seer Shivakumara Swami Dies at 111 - Sakshi

బెంగళూరు : తుమ్కురు సిద్ధగంగా మఠాధిపతి శివ కుమార స్వామిజీ(111) శివక్యైం చెందారు. లింగాయత్ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా పూజించే శివకుమార స్వామి అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల స్వామికి డిసెంబరు 8వతేదీన వైద్యులు ఆపరేషన్ చేశారు. అయినా స్వామిజీ ఆరోగ్యం కుదటపడలేదు. గత 15రోజులుగా ఆయన వైద్యుల సమక్షంలోని చికిత్స పొందారు. ఇక స్వామిజీ ఆరోగ్య పరిస్థితిపై గత మూడు రోజులుగా గోప్యత పాటించిన అధికారులు.. సోమవారం 11.44 నిమిషాలకు తుదిశాస్వ విడిచారని ప్రకటించారు. ఇక స్వామిజీ మృతిపై కర్ణాటక సీఎం కుమారస్వామి సంతాపం తెలిపారు. స్వామిజీ మరణవార్తతో అధికారులు మఠం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది సంఖ్యలోని ఆయన భక్తులు స్వామిజీ కడచూపు కోరకు అక్కడికి చేరకుంటున్నారు.

మంగళవారం సాయంత్రం శివకుమార స్వామిజీ అంతి సంస్కారాలు జరగనున్నాయి. స్వామిజీ మృతికి సంతాపంగా కర్ణాటక ప్రభుత్వం రేపు సెలవుదినంగా ప్రకటించింది. నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన శివకుమారస్వామిజీ అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ సిద్ధగంగా ఎడ్యూకేషన్‌ సొసైటీ పేరిట 125 విద్యాసంస్థలను నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో స్వామిజీకి పద్మభూషణ్‌ అవార్డును అందజేసింది. ఇక ఉదయం స్వామిజీ ఆరోగ్యం విషమించిందని అధికారులు ప్రకటించడంతో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరలు తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని మరి మఠానికి వచ్చారు.

ప్రధాని దిగ్భాంత్రి
శివకుమార స్వామిజీ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసమే శివకుమార స్వామిజీ జీవించారని, పేదరికం, సమానత్వం, ఆకలిపై పోరాటం చేశారని ట్వీట్‌ చేశారు. అణగారిన వర్గాలకు మంచి విద్యా, వైద్యం అందించడంలో స్వామిజీ కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. తాను తుమ్కురు సిద్ధగంగా మఠాన్ని దర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top