లైంగిక వేధింపులు... ప్రొఫెసర్‌పై వేటు

లైంగిక  వేధింపులు... ప్రొఫెసర్‌పై వేటు - Sakshi


న్యూఢిల్లీ:  విదేశీ రీసెర్చ్ స్కాలర్ను లైంగికంగా వేధించిన కేసులో ప్రసిద్ధ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌పై వేటుపడింది. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన పరిశోధనా విద్యార్థినిని వేధించిన ఆరోపణలు నిజమని విచారణ కమిటీ తేల్చడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.  



జేఎన్యూ ప్రొఫెసర్ దగ్గర బంగ్లాదేశ్కు చెందిన విద్యార్థిని పరిశోధన నిమిత్తం చేరింది. ఈ నేపథ్యంలో పార్టీ కోసమని ఆమెను ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించాడు. అనంతరం ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె యూనివర్సిటీ లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి ఫిర్యాదుచేసింది. తక్షణమే  ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ అధికారులు.. విచారణకు ఆదేశించారు.



విదేశీ విద్యార్థిని ఆరోపణలపై విచారణ చేపట్టిన కమిటీ అతనిని దోషిగా నిర్ధారించి, చర్యకు సిఫార్సు చేసింది. దీంతో పాలకమండలి  అత్యవసర సమావేశంలో తక్షణమే అతని సేవలు రద్దుచేయాలని నిర్ణయించామని   యూనివర్సిటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top