జియో సృష్టించిన మరో అద్భుతం

Jio Tv will Change the Way of Watching Cricket Online - Sakshi

క్రికెట్‌ మ్యాచ్‌ చూసే విధానంలో సమూల మార్పు

క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త అందిస్తూ.. సాంకేతికతలో విప్లవంలా జియో మరో కొత్త శకం ఆరంభించింది. జియో లైవ్‌ టీవీ యాప్‌లో మార్పులు చేస్తూ.. ప్రస్తుత మ్యాచ్‌ చూసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. జియో ప్రవేశపెట్టిన ఈ పరిజ్ఞానం ద్వారా క్రికెట్‌ మ్యాచ్‌ను ఐదు కెమెరా యాంగిల్స్‌లో వీక్షించవచ్చు. అంతే కాకుండా ఆడియోను గ్రౌండ్‌ మధ్య వికెట్ల వద్ద ఉన్న మైక్‌ నుంచి వినోచ్చు. మనకు కావాల్సిన భాషలో (ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ) కామెంట్రీని వినోచ్చు. ఇంకా, మ్యాచ్‌ స్కోర్‌, బంతులు, రన్‌రేట్‌, వంటి గణంకాలను మనకు నచ్చినప్పుడు, కావాల్సినప్పుడు ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు. మ్యాచ్‌లో ఎదైన బంతిగాని, వికెట్‌ గాని, సిక్స్‌గాని మిస్‌ అయితే క్యాచ్‌ అప్‌ ద్వారా మళ్లీ వెనక్కి వెళ్లి వీక్షించవచ్చు. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో కొత్త జియో లైవ్‌ టీవీ యాప్‌ అందుబాటులోకి రానుంది. 

క్రీడల్లో ఏఆర్‌, వీఆర్‌, ఇమ్మెర్సివ్ వ్యూయింగ్లో రాబోయే రోజుల్లో జియో విశేషమైన అనుభవాన్ని అందించడానికి కొనసాగుతుంది అని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ అన్నారు. ఇటివల జియో ఉత్తమ మొబైల్ వీడియో కంటెంట్ ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ మొబైల్ (గ్లిమో) అవార్డును గెల్చుకుంది. మార్చి నుంచి కొలంబోలో జరిగే టీ20 క్రికెట్ సిరీస్ నిదహస్ ట్రోఫీకి ప్రత్యేకమైన డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మ్యాచ్‌ వీక్షణలో కొత్త అనుభూతిని పొందటానికి జియో టీవీ యాప్‌ను అప్‌డేట్  చేసుకుంటే సరిపోతుంది. లేని వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top