ఐఐటీ ఖరగ్ పూర్ రీసెర్చ్ స్కాలర్ కు అరుదైన గౌరవం దక్కింది.
ఐఐటీ స్కాలర్ కు అరుదైన గౌరవం
Apr 26 2016 10:18 PM | Updated on Apr 4 2019 5:12 PM
ఖరగ్ పూర్: ఐఐటీ ఖరగ్ పూర్ రీసెర్చ్ స్కాలర్ కు అరుదైన గౌరవం దక్కింది. అగ్రికల్చర్, ఫుడ్ ఇంజనీరింగ్ లో రీసెర్చ్ స్కాలర్ గా ఉన్న కే అశోక్ కుమార్.. కంకర నేలలో సేంద్రీయ ఎరువులతో పంటలు పండించడంపై చేసిన కృషికిగాను అమెరికాలోని ఇంటర్నేషనల్ ప్లానెట్ ఇనిస్టిట్యూట్ 2,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 1.3లక్షల రూపాయలు) ప్రైజ్ మనీ అందించింది. కొత్త రకపు వరి వంగడాన్ని సేంద్రీయ ఎరువులతో ఎలా పండించవచ్చో ఆయన చేసిన పరిశోధనకుగానూ ఈ గౌరవం ఆయనకు దక్కింది.
Advertisement
Advertisement