భారత్‌లోకి 10మంది జైషే ఉగ్రవాదులు | Intelligence Warns Terrorists May Attack Across India | Sakshi
Sakshi News home page

దేశంలో 26/11 తరహా దాడులకు ప్లాన్‌

Sep 25 2019 11:28 AM | Updated on Sep 25 2019 11:38 AM

Intelligence Warns Terrorists May Attack Across India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. అమెరికా మాదిరే భారత్‌లో కూడా 26/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్‌ కోట్‌, జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్‌లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాక.. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement