స్టాండ్‌బై ఇంజన్‌తో జీఎస్‌ఎల్వీ ప్రయోగం! | Indian space agency may use standby engine to launch GSLV | Sakshi
Sakshi News home page

స్టాండ్‌బై ఇంజన్‌తో జీఎస్‌ఎల్వీ ప్రయోగం!

Aug 20 2013 11:05 PM | Updated on Sep 1 2017 9:56 PM

జీఎస్‌ఎల్వీ ప్రయోగం సోమవారం నిలిచిపోయిన నేపథ్యంలో, దీనిని సాధ్యమైనంత త్వరలో ప్రయోగించేందుకు స్టాండ్‌బై ఇంజన్‌ను ఉపయోగించే అవకాశాలను ‘ఇస్రో’ పరిశీలిస్తోంది.

చెన్నై: జీఎస్‌ఎల్వీ ప్రయోగం సోమవారం నిలిచిపోయిన నేపథ్యంలో, దీనిని సాధ్యమైనంత త్వరలో ప్రయోగించేందుకు స్టాండ్‌బై ఇంజన్‌ను ఉపయోగించే అవకాశాలను ‘ఇస్రో’ పరిశీలిస్తోంది. తమ వద్ద రెండో దశ స్టాండ్‌బై ఇంజన్ సిద్ధంగా ఉందని ‘ఇస్రో’ అధికారి ఒకరు మంగళవారం చెప్పారు. అయితే, సోమవారం ప్రయోగం నిలిచిపోయే పరిస్థితులకు దారితీసిన సమస్యను అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన అన్నారు.
 
  ఏదైనా విడిభాగంలో సమస్య ఏర్పడినట్లు తేలితే, ఆ బ్యాచ్‌కు చెందిన విడిభాగాలన్నింటినీ మార్చాల్సి ఉంటుందన్నారు. స్టాండ్‌బై ఇంజన్‌ను ఉపయోగించడం, విడిభాగాలను మార్చడం లేదా సమస్యను సరిదిద్దడం వంటి అన్ని అవకాశాలనూ ‘ఇస్రో’ పరిశీలిస్తోందని చెప్పారు. ఒకవేళ ఇంజన్‌లోనే అంతర్గత సమస్య ఏర్పడినట్లు తేలితే, మొత్తం ఇంజన్‌నే ధ్వంసం చేయాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement