గురుత్వ ప్రయోగాల వెనుక మనోళ్లు! | Indian scientists behind the gravity experiments | Sakshi
Sakshi News home page

Oct 4 2017 1:20 AM | Updated on Oct 4 2017 1:20 AM

Indian scientists behind the gravity experiments

బాలా అయ్యర్, రాజేశ్‌ నాయక్, సంజీవ్‌ దురంధర్‌

న్యూఢిల్లీ: గురుత్వ తరంగాలను గుర్తించినందుకుగాను ఖగోళ భౌతిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్లకు నోబెల్‌ వరించింది. అయితే ఈ ఘనత సాధిం చడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి కూడా ఎంతో ఉంది. గురుత్వ తరంగాలను గుర్తించేం దుకు చేసిన ప్రయోగాలకు నోబెల్‌ లభించడంతో కల నెరవేరినట్లయిందని బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియరిటికల్‌ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్‌ బాలా అయ్యర్‌ పేర్కొన్నారు. గురుత్వ తరంగాలను గుర్తించేందుకు అధునాతనమైన ప్రయోగాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘ఇండిగో’ ప్రోగ్రాంలో బాలా అయ్యర్‌ సాంకేతికంగా సాయమందించారు.

గురుత్వ తరంగాలను గుర్తించడం ద్వారా కొత్త తరం శాస్త్రవేత్తలు ఖగోళ పరిశోధనలపై దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న, ఐఐఎస్‌ఈఆర్‌– కోల్‌కతాకు చెందిన రాజేశ్‌ నాయక్‌ పేర్కొన్నారు. ఈ ప్రయోగాల్లో పుణేలోని ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన సంజీవ్‌ దురంధర్‌ కూడా పాలుపంచుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement