
పాములు పురుగులు.. కప్పలను తింటాయని మనకు తెలిసిందే. పాముల్లోకెల్లా చాలా డిఫరెంట్ కావాలనుకుందో లేక బాగా ఆకలైందో ఏమో కానీ ఉల్లిగడ్డలను తింది. అది కూడా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 11 ఉల్లిగడ్డలు. మరి వాటిని తిని కడుపు నింపుకుందా అంటే అదీ లేదు. మరి ఏం చేసిందనుకుంటున్నారు. పాపం వాటిని కొద్ది సేపు కూడా కడుపులో ఉంచుకోలేకపోయింది. మొత్తం కక్కేసింది. ఈ ఘటన ఒడిశాలోని అంగుల్ జిల్లా చెండిపాడ అనే గ్రామంలో జరిగింది.
సుశాంత బెహరాట్ అనే వ్యక్తి ఇంటిలో ఈ ఉల్లిగడ్డలను తిని బయటికి వచ్చి కక్కుతోందట. అయితే ఆ పాముకు ఏమైనా అవుతుందేమోనని స్థానికులు పాముల హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయగా వలంటీర్ హిమాన్షు వచ్చాడు. అయితే పాము అలా ఉల్లిగడ్డలను కక్కడం చూసి షాక్‌కు గురయ్యాడట. ఇలాంటి పామును చూడటం ఇదే తొలిసారని చెప్పాడు. పాము ఉల్లిగడ్డలను కక్కుతున్నప్పుడు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.