పాక్‌ ఎన్నికలపై స్పందించిన భారత్‌

India Reacts to Pakistan Elections - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత భారత్‌ తొలిసారి స్పందించింది. ఇమ్రాన్‌ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం ఉగ్రవాద రహిత దక్షిణాసియా కోసం నిర్మాణాత్మక కృషి చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ మాట్లాడారు. ‘సుస్థిరమైన, ఎలాంటి ఉగ్రవాదం, హింస లేని దక్షిణాసియా కోసం పాక్‌ కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రగతిశీల పాక్‌ను భారత్‌ కోరుకుంటోంది.

సార్వత్రిక ఎన్నికల ద్వారా పాకిస్తాన్‌ ప్రజలు ప్రజాస్వామ్యంపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయడాన్ని భారత్‌ స్వాగతిస్తోంది’ అని తెలిపారు. మరోవైపు, కశ్మీర్‌లో రక్తపాతాన్ని ఆపడానికి ఇరు దేశాలు ముందుకు రావాలన్న పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌కు స్నేహ హస్తం అందించాలని ప్రధాని మోదీని కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా కోరారు. ‘ఇమ్రాన్‌ స్నేహహస్తమిచ్చిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని మోదీ సద్వినియోగం చేసుకోవాలి’ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top