సాగరగర్భంలో తొలి మ్యూజియం!

India first underwater museum to open off Puducherry coast - Sakshi

పుదుచ్చేరిలో 26 అడుగుల మేర నిర్మాణాలు

సాక్షి, చెన్నై: దేశంలో తొలిసారిగా పుదుచ్చేరిలో సముద్ర గర్భంలో ఓ మ్యూజియం రూపకల్పనకు బీజం పడింది. 26 అడుగుల మేరకు నిర్మాణాలు సాగరంలో జరగనున్నాయి.  పుదుచ్చేరి సముద్ర తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్రెంచ్‌ వారి హయాంలో నిర్మించిన పురాతన చిహ్నాలు ఎన్నో ఈ తీరంలో ఉంటాయి. పుదుచ్చేరికి ఆదాయం విదేశీ, స్వదేశీ పర్యాటకుల ద్వారానే ఎక్కువగా వస్తోంది. దీంతో పర్యాటకంగా పుదుచ్చేరిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సముద్ర గర్భంలో ఓ మ్యూజియం ఏర్పాటుకు  కార్యాచరణపై దృష్టి పెట్టింది. కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంతో సమష్టి భాగస్వామ్యంలో నిర్మాణాలపై కసరత్తు జరుగుతోంది. నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ కడలూరు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో ఈ జలాంతర్గామిని మ్యూజియం కోసం ఎంపిక చేశారు. 61.3 మీటర్ల పొడవు, 10.2 మీటర్ల  వెడల్పు, 11.98 మీటర్ల ఎత్తు కల్గిన ఈ జలాంతర్గామిలో ఉన్న యంత్రాలు, ఇతర పరికరాల్ని తొలగించి మ్యూజియంగా మార్చడానికి అవసరమైన పనులు విశాఖపట్నంలో సాగుతున్నాయి. ఈ మ్యూజియంలోకి వెళ్లే మార్గంలో డాల్ఫిన్‌తో పాటు సముద్ర జలరాశుల్ని వీక్షించేందుకు తగ్గట్టుగా అద్దాలతో నిర్మాణాలు చేపట్టనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top