కూలిన వాయుసేన హెలికాప్టర్‌ | IAF Plane Crash In odisha | Sakshi
Sakshi News home page

కూలిన వాయుసేన హెలికాప్టర్‌

Mar 20 2018 3:21 PM | Updated on Mar 20 2018 3:21 PM

IAF Plane Crash In odisha - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : ఒడిశా-జార్ఖండ్‌ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం  భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది.  ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో  ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణ ణష్టం జరగలేదు. పైలట్‌తో పాటు మరొకరు గాయపడ్డగా...వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పశ్చిమ బెంగాల్‌లోని కలైకుందా వైమానిక స్థావరం నుంచి రోజు మాదిరిగానే శిక్షణ కోసం బయలుదేరిన విమానం వెనుక భాగం నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు సమాచారం.  కాగాప్రమాదానికి కారణం ఏమిటన్నదానిపై స్పష్టత రాలేదని, విచారణ చేపడుతన్నామని అధికారులు తెలిపారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement